సిద్దిపేట జిల్లా అక్టోబర్ 30
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడు జరిగింది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని సూరంపల్లిలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపుకు గాయమైనట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన టిఆర్ఎస్ కార్యకర్తలు ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తినీ చితకబాదారు.అనంతరం పోలీసులకు అప్పగించారు





