తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యఆత్మక నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తరాలు కూడా జారీ చేసింది.
సిర్పూర్ ,చెన్నూర్ ,బెల్లంపల్లి ,మంచిర్యాల ,ఇల్లందు, కొత్తగూడెం, మంథని ,ఆసిఫాబాద్ ,పీనపాక ,ములుగు, ఆశారావుపేట, భూపాలపల్లి ,భద్రాచలం స్థానాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
అదేవిధంగా మిగతా 106 స్థానాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.






