నిర్మల్ జిల్లా ,మామడి మండలం పోలీస్ స్టేషన్ ఎస్సై లంచం తీసుకుంటుండగా ఆదివారం రోజు ఏసీబీకి చిక్కారు. అనంత పేట్ గ్రామానికి చెందిన సతీష్ ఇటీవలే వేరే వ్యక్తితో గొడవపడ్డారు. ఎస్ఐ రాజు అతనిపై 323,341 ,291 సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
ఈ కేసులో రిమాండ్ చేస్తా అనడంతో పదివేలు ఇస్తేనే స్టేషన్ బెయిల్ ఇస్తానని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని ఏసీబీకి అందించడంతో సతీష్ ఎస్ఐ రాజుకు 10000 ఇస్తుండగా ఏసీబీ వాళ్లు పట్టుకున్నారు.
