-రేణికుంటలో ప్రజా ఆశీర్వాద సభ లో ఎమ్మెల్యే రసమయి
(తిమ్మాపూర్ అక్టోబర్ 27)
తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో శుక్రవారం రాత్రి సర్పంచ్ బోయిని కొంరయ్య, అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ హాజరయ్యారు.
రేణికుంట ఆడబిడ్డలు బతుకమ్మలు, భోనాలతో ఘనస్వాగతం పలికారు. రసమయన్న మూడవ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు హోరెత్తించారు.వివిధ పార్టీలకు చెందిన 100 మంది బీఆర్ఎస్ లో చేరగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి సామాన్య ప్రజానికానికి అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనకు కర్ణాటక రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితులు తాజా నిదర్శనమని అన్నారు. అభివృద్ధి పనుల పట్ల, ప్రజలకు ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేయడం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కర్ణాటకలో రైతులకు పండించిన పంటలు ఎండిపోతున్నప్పటికీ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని వాగ్దానం ఇచ్చి, బస్సుల్లో పురుషులు మాత్రమే ప్రయానించాలని బోర్డులు పెట్టడం వారి అసమర్ధ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్న ఎమ్మెల్యే బడుగు, బలహీన, నిరుపేద వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలనే ఏడాది కాలంగా అమలు చేయలేదని..తెలంగాణ లో అధికారం కోసమే కాంగ్రెస్ 6 గ్యారెంటీ ల పేరుతో దొంగ హామీలు ఇస్తోందని..ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగం అవుతారని అన్నారు…
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, శ్రీనివాసరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, జితేందర్ రెడ్డి, వైస్ ఎంపిపి ల్యాగల వీరారెడ్డి, అశోక్ రెడ్డి, సాయిల్ల కొమురయ్య,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత -అంజనేయులు,గ్రామ ఉప సర్పంచ్ కుంబం శ్రీనివాస్, దేవేందర్, బోంగాని రమేష్, బిఅర్ఎస్ మండల ఉపాధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామశాఖ అధ్యక్షులు, బిఅర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.