ప్రకటనలు

అనుమానిత లావాదేవిల పై సమాచారం ఇవ్వండి

92 Views

అనుమానిత నగదు లావాదేవీలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి బ్యాంక్ అధికారులకు సూచించారు.ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్ డ్రాలసమాచారాన్ని ఎన్నికల అకౌంటింగ్ నోడల్ ఆఫీసర్రో జువారీ నివేదిక అందజేయాలని అన్నారు.

గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ మీటింగ్ హల్ లో జిల్లాలోని అన్ని బ్యాంకుల కో ఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోజిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున

బ్యాంకుల్లో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అనుమానిత,లెక్కకు మించిన నగదు ఖాతాలపై నిఘా ఉంచి వారి సమాచారాన్ని ప్రతిరోజూ పంపించాలని సూచించారు.

ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలకు ఆయా బ్యాంకులు తప్పనిసరిగా జీపీఎస్ ను ఏర్పాటు చేసి, వాహనాలను పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థి, అభ్యర్థి సంబంధీకుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *