అక్టోబర్ 26
సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ గురించి మాట్లాడలేదని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,చింత ప్రభాకర్ లు అన్నారు. సదాశివపేట మం. పెద్దపూర్ గ్రామంలో కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో చింతా ప్రభాకర్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొని సందడి చేశారు. డీజే పాటలతో బతుకమ్మ చుట్టూ మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. తదనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అతిథులను ఘనంగా సన్మానించారు.
