బి ఆర్ ఎస్ లోకి బీజేపీ ముఖ్య నాయకులు వలసలు
పటాన్చెరులో కమలానికి జలక్
మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బిజెపి సీనియర్ నాయకులు శంకర్ యాదవ్
పటాన్చెరు ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:ఎమ్మెల్యే జిఎంఆర్
అక్టోబర్ 26
సంగారెడ్డి జిల్లా
పటాన్చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు, కుట్రలు చేసిన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయని నమోదు చేయనుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయిందని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల పరిగెత్తుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, కాంగ్రెస్ బిజెపి కుట్రను తిప్పి కొడతారని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. త్వరలోనే భారీ చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు.
హాజరైన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, నగేష్ యాదవ్, తదితరులు.
