(తిమ్మాపూర్ అక్టోబర్ 26)
రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల రమేష్, ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సమక్షంలో తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ రాజీవ్ రహదారి పై బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో దానికి నిరసనగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు..
ఈ సందర్భంగా రావుల రమేష్, దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారాడని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 9 ఏళ్ల నుంచి రైతుల పెట్టుబడి సాయం అందిస్తుందని, ఇది కొత్తగా ఇచ్చేది కాదని, దీని పై ఈసి కి ఫిర్యాదు చేయడం హేయమైన చర్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రైతులకు వ్యతిరేకి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో రైతులు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ల్యాగల వీరారెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..




