ఎన్నికలు సాఫీగా నిర్వహిద్దాం
బార్డర్ చెక్ పోస్టుల వద్ద బందోబస్తు
సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం
హుస్నాబాద్ ఎసిపి వాసాల సతీష్
హుస్నాబాద్
త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలను సాఫీగా నిర్వహిద్దామని హుస్నాబాద్ ఎసిపి వాసాల సతీష్ అన్నారు. హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో ఎసిపి అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఎసిపి వాసాల సతీష్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్చించారు. అదే విధంగా మద్యం, నగదు సరఫరా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యల పై ప్రత్యేకంగా చర్చించారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల పోలీసులు వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి సంబంధిత పోలీసు అధికారులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో హుస్నాబాద్ సి. ఐ. ఏర్రల కిరణ్, ఆయా జిల్లాల పోలీసు అధికారులు, తదితరులున్నారు
