కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవ్వంపల్లి
(తిమ్మాపూర్ అక్టోబర్ 26)
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు రాము,రమేష్, 100 మంది యువత కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా కవ్వంపల్లి మాట్లాడుతూ..
అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చి పదేళ్ళుగా ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
పదేళ్ళుగా అధికారంలో ఉండి భూకబ్జాలు,ఇసుక మాఫియా ద్వారా ప్రజలను మోసం చేసి దోచుకున్న నాయకులు డబ్బుల సంచులతో ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి వస్తున్న దొంగలకు బుద్ది చెప్పాలన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వధించి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు..