రాజకీయం

కాలేశ్వరం ప్రాజెక్టు లోపాలను పరిశీలిద్దాం రండి: మాజీ ఎంపీ

135 Views

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నాయకులు కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించి దావతులు చేసుకొని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ నేడు కాలేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాన్ని ఏమంటారు అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రశ్నించారు.

మంగళవారం ఆయన హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ ఈ విధంగా వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక సమస్యలను జరుగుతున్న వాస్తవాలను గమనించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చూపించడానికి నేడు బుధవారం హుస్నాబాద్ లోని తమ కార్యాలయం నుండి కాలేశ్వరం వెళ్ళుటకు మేధావులు ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులు అందరూ కలిసి మాతో రావాలని కోరారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వము నేడు సమాధానం ఏమి చెబుతుందని నిలదీశారు. ప్రభుత్వము ప్రచార అర్బటాలకు ఉన్నప్రాధాన్యతను ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు శ్రద్ధ చూపడం లేదని ఈ వైఫల్యాలు మనకు నిదర్శమని అన్నారు. ప్రాజెక్టు సందర్శన కోసం నేడు బుధవారం నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి పార్టీ ముఖ్య నాయకులు మేధావులు కలిసి రావాలని పిలుపునిచ్చారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *