సిద్ధిపేట జిల్లా:గజ్వేల్ సెప్టెంబర్ 16
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఢిల్లీ వాలా హోటల్ నుండి కోట మైసమ్మ రోడ్ వైండింగ్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులకు గృహలక్ష్మి పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావుని కలిసి చెప్పడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి గడ ముత్యం రెడ్డికి సిఫారసు చేయడం జరిగింది అలాగే గడ ముత్యం రెడ్డి కూడా వెంటనే మున్సిపల్ కమిషనర్ కి తెలపడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి గడకి సిఫారసు చేసినటువంటి మంత్రికి మరియు గడ ముత్యం రెడ్డికి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నరసింగరావు, గజ్వేల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగు ముదిరాజ్, బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం గౌడ్, ఉమర్, స్వామి మరియు ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులు పాల్గొనడం జరిగింది.





