పేరాయిగూడెం గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
అక్టోబర్ 23 భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామపంచాయతీలో గల అల్లూరి సీతారామరాజు కాలనీ (ఏ ఎస్ ఆర్ నగర్) నుండి 10 కుటుంబాలు మండల వైస్ ఎంపీపీ ఫణీంద్ర పార్టీ ప్రెసిడెంట్ చిప్పనపల్లి శ్రీను బజారయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వాళ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా ఈ నియోజకవర్గాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు అని ఎక్కడ చూసినా సి,సి రోడ్లతో గ్రామాలు దర్శనమిస్తున్నాయి అని అశ్వారావుపేట అభివృద్ధి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది అని అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో మా 10 కుటుంబాలు చేరడం జరుగుతుంది అని చెప్పారు.
ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారం జరుగుతుంది అని ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా ఈ రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వమే రావాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ చిప్పనపల్లి శ్రీను, తగరం హరికృష్ణ, గంధం ఆనంద్, నందికోల వెంకన్న బాబు , కోటగిరి కిషోర్, పుత్తూరు కిషోర్ రాజ్, తిరునాళ్ల భాస్కర్, నాగరాజు, పెద్దిరాజు, వెంకటేశ్వరరావు, నాయుడు, పి వెంకటేశ్వరరావు, దుర్గారావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
