భారీగా నగదు పట్టివేత
అక్టోబర్ 22
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలోని పరకాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. పెద్దపాపయ్యపల్లే గ్రామానికి చెందిన సదాశివ బైక్ పై వెళ్తుండగా అతడిని తనిఖీ చేశారు.
అతడి దగ్గర రూ. 8, 90, 000 లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బొల్లం రమేష్, ఎసిపి జీవన్ రెడ్డి తెలిపారు . నగదుకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో వాటిని సంబంధిత అధికారులకు అందజేసినట్లు ఎసిపి తెలిపారు.
