విచారణ కు ఆదేశం
– విచారణ చేసి ప్రాథమిక రిపోర్ట్ అందజేసిన అదనపు drdo మదన్ మోహన్- అప్పటి పంచాయితీ సెక్రటరీ తప్పిదం తో
వృద్దుడు మరణించినట్లు పేర్కొంటూ పెన్షన్ తొలగించాడని తెలిపిన అదనపు drdo
– పొరపాటును అప్పుడే గుర్తించి పెన్షన్ పునరుద్దరణ కు సెర్ఫ్ సీఈఓ కు నివేదించినట్లు వెల్లడి
– త్వరలోనే వృద్దుడు కొమురయ్య కు తిరిగి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కు తెలిపిన అదనపు drdo మదన్ మోహన్
సిరిసిల్ల 05, సెప్టెంబర్ 2022:
వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కొమురయ్య పెన్షన్ ను తొలగింపు ఘటన పై సోమవారం పలు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాల పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు.ఈ ఘటన పై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వివరాలు అందజేయాలని drdo ను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అదనపు drdo మదన్ మోహన్ క్షేత్ర ప్రాథమిక రిపోర్ట్ అందజేశారు.
అప్పటి పంచాయతీ కార్యదర్శి 2019లో తమ లాగిన్‌లలో పొరపాటున మరణం అని పేర్కొంటూ వృద్దుడు కొమురయ్య పింఛను తొలగించారు.
ఈ విషయం తమ దృష్టికి గతంలో రాగానే పింఛన్ పునరుద్ధరణ సెర్ప్ CEOకి నివేదించామని తెలిపారు.
ఇప్పటికీ పునరుద్ధరించలేదనీ
మరోసారి పింఛన్ ను పునరుద్ధరించమని లేఖ పంపామని తెలిపారు.
త్వరలోనే వృద్దుడు కొమురయ్య కు తిరిగి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
