పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి
అక్టోబర్ 21
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామంలో మోటం సదయ్య కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు రెండో అమ్మాయి అఖిల పెళ్లి కొరకు సంబంధాలు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు పెళ్లి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్న అని అఖిల బదులు చెప్పగా.
అమ్మాయిని తల్లిదండ్రులు మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మందలించగా అమ్మాయి అఖిల మనస్పర్దానికి లోనై తెలిసి తెలవని మనస్తత్వంతో తేదీ17/10/23 మంగళవారం రోజున తండ్రి సదయ్య మిరప చేను కోసం తెచ్చుకున్నటువంటి పురుగుమందును అఖిల తాగినది విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పరకాలలోని ఓ ప్రైవేటు హాస్పటల్ తీసుకువెళ్లారు.
నాలుగు రోజుల నుండి ట్రీట్మెంట్ చేస్తుండగా 21/10/23 రోజున తుది శ్వాస విడిచినది విషయం తెలుసుకున్న బంధువులు నారాయణపురం గ్రామస్తులు మృత్రాలి ఇంటికి చేరుకొని బోరుమని ఏడుస్తున్నారు
