Breaking News

20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు

131 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు 20 సంవత్సరాల తర్వాత సంక్రాంతి సందర్భంగా కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని చిన్ననాటి చెడ్డి దోస్తులు అందరు కలిసి క్రికెట్ ఆటలు ఆడారు.. ఎల్లారెడ్డిపేట వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ స్నేహితులు క్రికెట్ ఆట పాడి తమ అనుభవాలను ఒకరికి ఒకరు పంచుకున్నారు. సొంత గ్రామాన్ని విడిచి ఉద్యోగ రీత్యా వివిధ దేశాలలో మరియు వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ చిన్ననాటి దోస్తుల రావడంతో ఒకరికొకరు ఆనందాన్ని పంచుకొంటూ సంక్రాంతి పండుగ అందరినీ కలిపింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.. ముత్యాల సురేష్ రెడ్డి. ముత్యాల శ్రీపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బొంబాయి శ్రీను,జాన్, రాజు ,ప్రదీప్, నాగుల శేఖర్, శ్రీనివాస్, సుమారు 50 మంది ఇది కలుసుకొని అనుభవాలను పంచుకున్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7