Ts లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 13 :
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి భూక్య రాములు నాయక్ ( 32 ) అక్కడికక్కడే మరణించారు,
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి గంభీరావుపేట మండలం రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేసే రాములు నాయక్ వ్యక్తిగత పనుల పై గంభీరావుపేట మండల కేంద్రానికి శుక్రవారం ఉదయం టిఎస్ 16 ఇ కె 1311 నెంబర్ గల స్కృటిపై వెళుతుండగా సిద్దిపేట డిపోకు చెందిన టి ఎస్ ఆర్ టి సి బస్సు నెంబర్ ఏపీ 29 జెడ్ 1975 డీ కొట్టింది,
ఈ సంఘటన లో రాములు నాయక్ అక్కడికక్కడే మరణించాడు ,
ఆయనకు బార్య కళావతి , కూతుర్లు రేవతి ,మున్నీ ,కుమారుడు విశ్వేష్ లున్నారు ,
గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ,





