తెలంగాణ లో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే మీ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి ని చేస్తామని బహుజన సమాజ్ పార్టీ చీప్ మాయావతి అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో గురువారం జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని తెలిపారు.
మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆమె విమర్శించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ని ఈ ఎన్నికలలో ఓడించాలని ఆమె పిలుపు ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తరువాత భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బీఎస్పీని గెలిపించాలని బీఎస్పీ పార్టీ అదినేత్రి మాయావతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
