రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల నారాయణపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ నవ దుర్గా యూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శ్రీ నవ దుర్గా యూత్ మాత మంటపం వద్ద ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మొదట గణపతి పూజ,చండీ హోమం, చండీ హావనం,పారాయణం వేదపండితులు బ్రహ్మశ్రీ బుగ్గ శ్రీనివాస్ వేణుగోపాల చార్య లు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక విశేష పూజా తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
చండీ హోమం లో ఎనిమిది మంది దంపతులు పాల్గొన్నారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా అమ్మవారు భక్తులకు గురువారం శ్రీ మహా చండీ దేవి అవతారంలో దర్శన మిచ్చారు, విగ్రహ మండపం దగ్గర ఉదయం రాత్రి పలు రకాలైన విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు నిర్వాహకుల పేర్కొన్నారు.శ్రీ మహాచండీ అమ్మవారిని ఆరాధించడం వల్ల జరుగు ప్రయోజనాలు అద్భుత విషయాల గురించి భక్తులకు వివరించారు, భక్తులను భక్తి మార్గంలో తన్వయత్వం చందేటట్టు బోధిస్తున్న తన ఆధ్యాత్మికత భక్తులను విశేషంగా ఆకర్షించింది, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించగా సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి,అలుసాని ప్రవీణ్,మాజీ ఎంపీపీ ఎలిసాని సుజాత మోహన్,ఎంపీటీసీ అపేరా సుల్తాన్ మజీద్, లింగాల రాజు, లింగాల యాదగిరి, బొల్గం రాధాకృష్ణ, చింతల రాజేష్, లింగాల రమేష్,లింగాల నరేందర్, కొండేటి రవి, లదునూరు శేఖర్,పాములు లింగం,పాముల శ్రీనివాస్ (డాక్టర్ )పల్లె రాజు, పల్లె సాయి, ముస్కంటి సాయి కృష్ణ లు పాల్గొన్నారు.
