కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీకోసం 6 గ్యారంటీ పథకాలను తెచ్చింది ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ పథకాలను అన్నింటిని అమలు చేసింది అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు.
అదేవిధంగా బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆమె వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని కానీ బిఆర్ఎస్ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా లేరని ఈసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు.
