-ఆరెపల్లి ఆరోపణలు అక్షరాల నిజమే..
-మానకొండూర్ బీజేపీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్.
(మానకొండూర్ అక్టోబర్ 19)
మానకొండూర్ నియోజకవర్గ దళితులపై సంక్షేమం పై పట్టింపులేని ఎమ్మెల్యే రసమయి నిజమైన దళిత ద్రోహి అని మానకొండూర్ మండల బీజేపీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ అన్నారు.మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పై పత్రికా ముఖంగా విమర్శించిన తిమ్మాపూర్ మండల బిఆర్ఎస్ నాయకుల తీరు పై గురువారం మానకొండూర్ బీజేపీ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. దళిత మోర్చా నాయకులందరూ కలిసి మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి పై బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ చేసిన ఆరోపణలు అక్షర సత్యమని పేర్కొన్నారు.నియోజకవర్గంలో ఎంతమంది కి దళిత బందు వచ్చింది? ఎంతమంది కి మూడెకరాల భూమి వచ్చింది? డబుల్ బెడ్రూమ్ ల పథకంలో ఎంతమంది దళితులు లబ్ధి పొందారు? అనే విషయాలను చెప్పకుండా ఎంతోమందికి ఆశలు చూపిస్తూ దళితులను మోసం చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.రసమయి పేరుతో ఆత్మహత్య కు పాల్పడిన బెజ్జంకి మండలం గూడెం కు చెందిన మహంకాళి శ్రీనివాస్ కుటుంబానికి ఏం న్యాయం చేసారని అడిగారు.
తిమ్మాపూర్ మండలం రాజీవ్ రహదారి పక్కన ఏర్పాటు చేసిన అంబెడ్కర్, జగ్జీవన్ రాం విగ్రహాలను ఆవిష్కరణ చేయకుండా ముసుగులు వేసి దాదాపు రెండేళ్లయినా ఇంకా అనుమతి రాకున్నా కూడా అబద్దాలు ఆడుతున్నారని అన్నారు.అట్టి విగ్రహలను ఈ నెలాఖరుకు ఆవిష్కరణ చేస్తామని చెబుతున్న మీరు వెంటనే అట్టి అనుమతులకు సంబందించిన పత్రాలను చూపించాలని ఛాలెంజ్ చేసారు.దళితుల సంక్షేమం పై చిత్తశుద్ధి ఉన్నట్లయితే మానకొండూర్ చెరువు కట్టపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఈ సమావేశం లో గన్నేరువరం మండల బిజెపి అధ్యక్షులు నగునూరి శంకర్, సీనియర్ నాయకులు సిరిసిల్ల చంద్రయ్య,కొండ్ర వరప్రసాద్,ఆరెపల్లి క్రాంతి,సునంద్, శనిగరపు ఐలయ్య, జాగిరి రమేష్, ఎల్కపల్లి స్వామి, ప్రశాంత్, మోదుంపల్లి సాయి వినయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.