రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందన్నారు.ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట,వీర్నపల్లి మండలాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు పథకాల గ్యారెంటీ కార్డుల పంపిణీలో మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపించడం జరుగుతుందన్నారు.
గృహలక్ష్మి కింద 2500 వందల రూపాయలు మహిళలకు నెలనెలా ఇవ్వడం జరుగుతుందన్నారు. బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు 4000 రూపాయల పెన్షన్ పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. రైతులకు రుణమాఫీ తో పాటు క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ ఏడాదికి 15000 రూపాయలు కౌలు రైతుకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పడం పట్ల రైతులు హర్షిస్తున్నారని అన్నారు.
విద్యార్థుల చదువుల కోసం ఐదు లక్షల రూపాయల గ్యారెంటీ కార్డును విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం పట్ల సామాన్య కుటుంబాలు సంతోషపడుతున్నాయని అన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు బీపేట రాజు పాల్గొన్నారు




