నేరాలు

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

209 Views

ఒక కిలో గంజాయి పట్టివేత

నిందితుని వివరాలు:తమిళరసం సన్నాఫ్ కన్నా వృత్తి ఐటి పార్క్ ఉద్యోగి, 6వ తూర్పు వీధి, అరుప్పుకోట్టై, జిల్లా; విరుదునగర్, తమిళనాడు.

వివరాలకు వెళ్ళితే
సాయంత్రం మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్ నగర్ ప్రాంతం లో నమ్మదగిన సమాచారం మేరకు అనుమానస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో 1 కేజీ డ్రై గంజాయి లభించింది. దీని విలువ సుమారు 25000/- రూపాయలు ఉంటుంది. అనంతరం అతడిని విచారించగ అతని పేరు తమిళరసం, తమిళనాడు అని తెలిపి చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో మహారాష్ట్ర బల్లర్షలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి మంచిర్యాల ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపడం జరిగింది.

నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *