సెప్టెంబర్ 11 నిజామాబాద్ నగరం
– తెలంగాణలో అభివృద్ధిలో రెండవ స్థానం నిజామాబాద్
-ప్రతి డివిజన్ లో డ్రైనేజీ ల నిర్మాణం..
-పచ్చదనం విరజిల్లెల పార్కుల నిర్మాణం..
-నగరంలో 40 వేల మందికి ఆసరా పింఛన్లు.
*అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల
*11-సెప్టెంబర్-2023,*
*నిజామాబాద్ అర్బన్*
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
@.. రూ. 1 కోటితో డివిజన్ నం.6 లో నూతనంగా నిర్మించే రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు వినాయక్ నగర్ హనుమాన్ మందిరం వెనకాల భూమిపూజ చేశారు.
@.. రూ.1 కోటి తో డివిజన్.23లో నూతనంగా నిర్మించిన రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు వినాయక్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాప్ వెనకాల భూమిపూజ చేశారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ…*
★ముఖ్యమంత్రి గా కేసీఆర్ సారథ్యం లో అభివృద్ధి సంక్షేమం లో దేశం లో మొదటి స్థానం లో ఉంది.
★తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో నిజామాబాద్ నగరం సుందరీకరణంగా మారింది.
★తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో నిజామాబాద్ నగరం రెండవ స్థానంలో ఉంది.
★నిజామాబాద్ నగరంలో ప్రతి గల్లీలో రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మించబడ్డాయి.
★ప్రధాన రోడ్లను విస్తరించి విశాలంగా నిర్మించాము.
★ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద రుబ్ నిర్మించి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చాము.
★ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లోని ఐటి హబ్, మినీ ట్యాంక్ బండ్, తదితర అభివృద్ధి పనులు జరిగాయి
★ నగరంలో ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
★నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తడ్కల్ ఉమా రాణి శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సిర్ప రాజు, కార్పొరేటర్ ధర్మపురి, బిఆర్ఎస్ నాయకులు పంచారెడ్డి సూరి, ఎనగందుల మురళి , పాల్తీ రవికుమార్, కులాచారి సంతోష్, మధు రెడ్డి, మాకు రవిారెడ్డి, రాజేష్, శివ లింగం, వెంకటేష్, పాక సురేష్, ఎర్రం గంగాధర్, పుప్పాల భాజన్న కొండ వీరశేఖర్, మరియు స్థానికులు ఉన్నారు.
