అక్టోబర్ 18
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
హైదరబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకుంటానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.ఒక వ్యక్తి వేధింపుల వల్లే ప్రవళిక చనిపోయిందని తల్లి, తమ్ముడు తీవ్ర ఆవేదన చెందారు. వారు న్యాయం చేయాలని కోరారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మీకు మి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు అదేవిధంగా ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తం,కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం అని అన్నారు.
