చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 12 :
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయి శ్రీ కళాశాల , పద్మ శ్రీ కళాశాల విద్యార్థులకు గంజాయి మరియు మాధకద్రవ్యాల నిర్ములన పై “గంజాయి వద్దు-ఆరోగ్యం ముద్దు ” ఫ్లెక్సీలను ,గోడప్రతులను ఎక్సైజ్ సిఐ ముస్తాఫా ప్రదర్శించి అవగాహన కల్పించారు.
ఎక్సైజ్ ఎస్సై విజేందర్ మాట్లాడుతూ యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు , ఎవరైనా గంజాయి సేవించడం, రవాణా చేయడం, అమ్మడం చట్టపరంగా నేరమని అట్టి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నరు.కాలేజీ ప్రిన్సిపాల్స్ మరియు లెక్చరర్లు విద్యార్థుల ప్రవర్తనలోని మార్పుల పై దృష్టి పెట్టాలన్నారు.ఎవరి పైనైన అనుమానం ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ , లెక్చరర్లు,ఎక్సైజ్ ఎస్సైలు రాజేందర్, శేఖర్ ,కానిస్టేబుల్స్ మధు, జి.శ్రీనివాస్,స్వప్న, నరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
