Breaking News

అరెస్ట్

101 Views

అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్:అక్టోబర్ 17

సీఎల్పీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు .

రెండు రోజుల క్రితం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చారు.

డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా అని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. గన్ పార్క్ వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు భారీగా కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు.దాదాపు పావు గంటకు పైగా పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాలను అనుమతించలేమని పోలీసులు వివరించారు. గన్‌పార్క్‌ వద్దకు వెళ్లి తీరుతామని చెప్పడంతో అందుకు పోలీసులు అంగీకరించలేదు. చివరకు పోలీసుల వాహనంలో రేవంత్‌ రెడ్డిని తరలించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *