నేరాలు

సంఘవిద్రోహశక్తులకు సహకరించదు

143 Views

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్స్ మరియు ఫెర్రీ పాయింట్లు సందర్శించిన మంచిర్యాల డీసీపీ.

అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీచెక్ పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలి : మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కెకన్

ఎన్నికల భద్రతా చర్యలలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా నీల్వయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జజులపేట, సంపుటం, వేమనపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీస్ సిబ్బందికి తగు జాగ్రతతలు సూచించారు. వేమంపల్లి లోని ఫెర్రీ పాయింట్ ను సందర్శించి అక్కడ పడవలు నడిపే వారితో మాట్లాడి అటువైపుగా వెళ్తున్న కొంతమంది ప్రయాణికులను వారి వస్తువులను తనిఖీ చేసినారు. తరువాత కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పంగిడీ సోమరం మరియు అన్నారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది తో కలిసి వాహన తనిఖీలు చేపట్టినారు.

మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కెకన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని డీసీపీ సూచించారు.

ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వద్దన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు ఆకర్షితులు కావద్దన్నారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద ఎదురైనా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.

మహారాష్ట్ర నుండి మన వైపు డబ్బులు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఇతర వస్తువులు, మద్యం రాకుండా తనిఖీలను నిర్వహించాలని సూచించారు.

ప్రతి వాహనాన్ని, వ్యక్తి ని క్షుణ్ణం గా తనిఖీ చేయాలన్నారు. వాహనాల తనిఖీల సమయంలో వీడియోగ్రఫీ తీసుకోవాలని అన్నారు . ఆయా తనిఖీల లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసిపి మోహన్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్, నీల్వాయి ఎస్సై సుబ్బారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *