రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దండు శ్రీనివాసు ను అధ్యక్షులుగా,ఉపాధ్యక్షులుగా బోయిని నర్సయ్య,ప్రధాన కార్యదర్శిగా పెరుమల సతీష్, కోశాధికారిగా జజ్జరి బాల నర్సు, సలహాదారులుగా బొమ్మన లేని నారాయణ,జిన్న నాంపల్లి, కనమేణి సాయిలు,గౌరవ అధ్యక్షులుగా పెద్దమ్మల దేవయ్య, రైటర్ దాసరి సత్తయ్య కోల బాలును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
