Breaking News

అరెస్ట్ చేయడం సిగ్గుచేటు

102 Views

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి ని హౌజ్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు గడిపే సుజిత్ కుమార్

అక్టోబర్ 15

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బి  ఆర్ ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. కేసీఆర్ సభలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తామని, బహిరంగ సభని అడ్డుకుంటామని భయంతో ఈరోజు ఉదయం కొహెడ మండలం వెంకటేశ్వరపల్లీ లోని  నివాసానికి పోలీసులు చేరుకొని పై అధికారుల అదేశమేరకు హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు గడిపే సుజీత్ కుమార్

ఈ సందర్భంగా  మాట్లాడుతూ చట్టాన్ని గౌరవిస్తామని అక్రమ అరెస్టులతో, హౌజ్ అరెస్టులతో ప్రజాఉద్యమాలని ఆపలేరని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్తామని నిరుద్యోగుల విద్యార్థుల గోస ఈ ప్రభుత్వానికి తగులుతుంది.రాష్ట్రంలో నిర్వహించిన ప్రతి పరీక్ష ఒకవైపు పేపర్ లీకు కావడం మరోవైపు పరీక్షలు రద్దు కావడం వల్ల రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర మనోవేదనకు గురవుతుందని విచారం వ్యక్తం చేశారు.

హుస్నాబాద్ ప్రాంతం పై ఎమ్మెల్యే సతీష్ బాబు మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్  సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని దానికి నిదర్శనమే హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చే ఎన్నికలలో సతీష్ బాబును సాగనంపి హుస్నాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో, కాల్వల క్రాంతి, కాల్వల రాహుల్, హరీష్ రెడీ,అనిల్, తదితరులు పాల్గొన్నారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *