మంచిర్యాల 15 అక్టోబర్: మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు మొదలయ్యాయి తేదీ 15-10-2023 నుండి 23-10-2023 వరకు అమ్మవారి మహోత్సవములు జరుపబడును. గత మూడు సంవత్సరాల నుండి శ్రీ కోదండ రామాలయంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ దాత వూడెం వెంకటస్వామి-భాగ్యలక్ష్మి దంపతులు ఈరోజు పూజలో పాల్గొనడం జరిగింది. ఈరోజు నుండి తొమ్మిది రోజుల వరకు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించబడును. గౌతమి నగర్ కాలనీ వాసులందరిపై అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆలయ అర్చకులు సంగర్స్ సాయి కమార్ శర్మ,ఆచ్చీ రామ్మోహన చార్య గారు కోరడం జరిగింది. కావున భక్తులందరూ పాల్గొని నవరాత్రి మహోత్సవాలు విజయవంతం చేయగలరు. ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం రాజేష్, అంకం చంద్రయ్య వంగపల్లి పూర్ణ చందర్ రావు చిట్టినేని రామారావు మరియు కమిటీ సభ్యులు.
