మంచిర్యాల జిల్లా లోని మున్సిపాలిటీ క్యాతన్ పల్లి చెందిన బి. గణేష్ పుట్టిన రోజు సంద్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ మిత్రులుతో కలిసి జనని బ్లడ్ బ్యాంక్ లో రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ సహకారంతో కేక్ కట్ చేయించి మరియు సల్వా తో సత్కరించి, తదనంతరం బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా సుమారుగా 10 మంది తో రక్తదానం చేసినారు.
చెన్నూర్ నియోజక వర్గం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఏడోవ వార్డు కౌన్సిలర్ పొలం సత్యనారాయణ, రిపోర్టర్ ఉమేష్ , మురళీధర గణేష్ గారికి జన్మదిన శుభకాంక్షలు తెలిపి మరియు రక్త దాతలకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన
రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం మరియు ప్రేమ్ కుమార్ సింగ్, అండ్ గణేష్ , మురళీధర్, రమేశ్, ఉమేష్ , రాజు, అందరు పాల్గొని పుట్టినరోజు వేడులను విజయవంతం చేసినారు.
