కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
పోలీస్ వాహనాల్లో డబ్బు తరలింపు
బీఆరెస్ కు మెదక్ జిల్లాపై సవతి తల్లి ప్రేమ
కార్యకర్తల అండతో కాంగ్రెస్ పార్టీదే గెలుపు
6గ్యారంటీలను గడపగడపకు ప్రచారం చేయాలి
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్
అక్టోబర్ 14
మంత్రి హరీష్ రావు పోలీస్ వాహనాల్లో డబ్బును మెదక్ తరలించి, రోజుకో నాయకుణ్ణి కొనుగోలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. శనివారం స్థానిక సాయి బాలాజీ గార్డెన్ లో మెదక్ పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మైనంపల్లి రోహిత్ తో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈసందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మాట్లాడారు. మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చుపెడుతున్నరని మండిపడ్డారు. సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ గ్రామానా, గడప గడపకూ ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యకర్తల బలంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావు మెదక్ కు పట్టిన శని అని, ఆయన్ను తరిమి, తరిమి వెంటాడుతానని అన్నారు.
మెదక్ ను వదిలేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇప్పటివరకు మెదక్ కు రింగ్ రోడ్డు లేదు.. సిద్దిపేట అభివృద్ధి చూస్తే అర్థమవుతుందన్నారు. పోచారం వద్ద ఉన్న జింకల పార్కును సిద్దిపేటకు తరలించుకు పోయారన్నాన్నారు.18 జిల్లా కార్యాలయాలు సిద్దిపేటకు తరలి వెళ్లాయని, ఇది అన్యాయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 20018 నుంచి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని, ప్రవళక ఆత్మహత్య చేసుకున్న విషయాన్నీ సభలో ప్రస్తావించారు.
అనంతరం మైనంపల్లి సోషల్ వెల్ఫేర్ సంస్థ అధ్యక్షులు, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రోహిత్ మాట్లాడారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తే, మెదక్ లో 100 పడకల ఆసుపత్రి ఉందని.. ఇదా అభివృద్ధి అని ప్రశ్నించారు
