టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమ్మకాలు.. కొనుగోళ్లు అధికం అయ్యాయి. ఎప్పుడు ఎవ్వరు అమ్ముడుపోతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
గత చరిత్రను ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి.
మంచిర్యాల నియోజకవర్గ ప్రజలపై నాకు విశ్వాసం ఉంది. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పకుండా నన్ను గెలిపిస్తారు.
ఇంద్రవెల్లి, నస్ఫూర్ సత్యాగ్రహ సభను విజయవంతం చేసిన ఘనత కార్యకర్తలదే.
ఈ 45 రోజులు కష్టపడితే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. ప్రతి పేదవాడికి మనం న్యాయం చేయగలుగుతాం. ప్రతి గ్యారంటీని మనం అమలు చేస్తాం.
ప్రతి కార్యకర్త ఈ 45 రోజులు కష్టపడితే… కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుంది.
నస్పూర్ కార్యకర్తల సమావేశంలో స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ ప్రేమ్ సాగర్ రావు.






