-మానకొండూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి లక్ష్మికిరణ్
(తిమ్మాపూర్ అక్టోబర్ 14 )
కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజ కవర్గం పరిధిలోని ఎలక్షన్ కో-ఆర్డినేషన్ పై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఎన్నికల నిర్వహణ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని శనివారం అలుగునూరులోని ప్రైవేట్ బాంకెట్ హాల్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి లక్ష్మికిరణ్, రూరల్ ఏసిపి కరుణాకర్ రావు, నోడల్ ఆఫీసర్ ఏసిపి మాధవి తో పాటు ఆయా మండలాల తహసిల్దార్లు, సీఐలు, ఎస్సైలు, రెవెన్యూ,పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికలపై అధికారులకు సిబ్బందికి అవగాహనతో పాటు శిక్షణ, విధి నిర్వహణ,తదితర అంశాల పై వివరించారు.