సంగారెడ్డి అక్టోబర్ 13 :సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరి రూపేష్
నియమితులయ్యారు.
వరంగల్ జిల్లా ఆయన స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన 2016 యూపీఎస్సీ పరీక్షల్లో 526 ర్యాంకు సాధించారు. 2017 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆయన. తల్లిదండ్రులు రమణయ్య, సరోజనమ్మ. ఇటీవల వరకు సంగారెడ్డిలో ఎస్పీగా పనిచేసిన ఎం. రమణకుమార్ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో తాజాగా రూపేష్కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం చదువు మాత్రమే ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని నమ్మి, కష్టాలన్నింటినీ భరిస్తూ ఆయన ఐపీఎస్ స్థాయికి చేరి ఆదర్శంగా నిలిచారు.




