వర్గల్ మండల్, మీనాజ్పెట్ అక్టోబర్ 13 :వర్గల్ మండలం లో వ్యవసాయ శాఖ వారు ఆయిల్ ఫామ్ పంటల వివరణ.
వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మీనాజ్పేట్ గ్రామంలో రైతు ఆల్కంటి వెంకటేష్ వ్యవసాయ క్షేత్రంలో పంట పర్యవేక్షణ పై రాష్ట్ర ముఖ్య సలహాదారు ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బి.ఎన్.రావు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, నీటి వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు పొందవచ్చని తెలిపారు.
మండలంలో ఉన్న నేలలు ఆయిల్ ఫామ్ పంటకు మొక్కల ఎదుగుదలకు అనుకూలమని తెలిపారు. మొక్కలకు నీరు ఎక్కువగా ఉండకుండా చూడాలని ఎక్కువ తడి ఇవ్వడం వల్ల మగజాతి గెలలు వస్తాయని, ఆడ జాతి తక్కువగా వస్తాయని నీరు పొదుపుగా ఉండాలని తెలిపారు.
ప్రస్తుత జనాభా ప్రకారం 25 మిలియన్ టన్నులు ఆయిల్ ఫామ్ పంటలు అవసరమని, సంప్రదాయ నూనె పంటలు అన్నీ కలిపి 10 మిలియన్ టన్నులు మాత్రమే పండుతుందని, మలేషియా ఇండోనేషియా నుండి ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నామని, కనుక ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కి అనుకూలంగా నూనె పంటలు పండించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో రైతులు ఆయిల్ ఫామ్ పంటను పండించుకుని లాభాలు పొందవచ్చని ఆయిల్ఫడ్ డి ఎం శంకర్ తెలిపారు. ఎన్ఎంఈఓ ( నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్) తరపున ఆయిల్ ఫామ్ పంట పండించడానికి సబ్సిడీ అందిస్తున్నారు.
మండలంలో ప్రస్తుతం 220 ఎకరాలలో పండిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు సాగు చేస్తున్నామని, మన జిల్లా సిద్దిపేట జిల్లా 11200 ఎకరాలలో మొదటి స్థానంలో ఉందని అనిల్ కుమార్ తెలిపారు.
మొక్క ఒత్తిడికి గురికాకుండా సరిపడా నీరు ఇవ్వాలని తెలిపారు. 365 రోజులు 30 సంవత్సరాల పాటు మొక్కకు రక్షణ ఇవ్వాలని తెలిపారు. ఒక మీటర్ దూరం వదిలి మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటలు పండించుకోవచ్చని తెలిపారు. మొక్కల మధ్యలో ఉన్న కలుపు మొక్కలను తొలగించి ఎరువులు వేసుకున్నట్లయితే మొక్కలు తొందరగా పెరిగి దిగబడి అధికంగా వస్తుందని తెలిపారు. పరిశ్రమలు మన జిల్లాలోనే ఏర్పాటు చేసుకోవచ్చని రైతుకు మార్కెటింగ్ ఇబ్బంది ఉండదని తెలిపారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ములుగు అనిల్ కుమార్, మండల వ్యవసాయ అధికారిని శేష శయన, ఏ ఈ ఓ లు ధర్మేంద్ర, సంతోష్, భారతి, సునీత, స్వర్ణ, ఆయిల్ పంప్ శాఖ డిఎం శంకర్, మండల ఇన్చార్జ్ వలినాథ్, విజయ్, రైతులు వెంకటేష్, ఆంజనేయులు, సహదేవ్ సత్యనారాయణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.