(తిమ్మాపూర్ అక్టోబర్ 11 ది క్రైమ్ న్యూస్ )
మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంలో తిమ్మాపూర్ మండల కాంగ్రేస్ ఎస్సి సెల్ అధ్యక్షులు రెడ్డిగాని రాజు, గ్రామ కమిటీ తో కలిసి కాంగ్రేస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీ కార్డు ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో గడప గడపకు వెళ్లి కార్డులో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను అందరికి వివరించారు.
నవంబరు 30 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ని అత్యధిక మెజారిటీ తో గెలిందుకుందామని కాంగ్రేస్ పార్టీని దేశంలో, రాష్టంలో గెలిపించుకోవాలని , పేద, నిరుపేద, బడుగు, బలహీన వర్గాలు కేవలం కాంగ్రేస్ పాలనలోనే ప్రజలు నిత్యసంతోషం గా జీవిస్తారని, ఈ ఆరు గ్యారంటీతో ప్రతి కుటుంబంలో వెలుగులు నిండుతాయని, తప్పకుండా ప్రతి ఒక్కరు చేతిగుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా రెడ్డిగాని రాజు మాట్లాడుతూ…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పాలనను బొందపెట్టేందుకు, కాంగ్రేస్ పార్టీ ని గెలిపించేందుకు ప్రజలు,ఓటర్లు, చాలా ఉత్సహంగా ఊన్నారన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు కరివేద రంగారెడ్డి, నేదునూరు గ్రామ కమిటీ, ఎలగందుల ప్రభాకర్ , రెడ్డిగానిమొగిలి, ఎలగుందుల రాజేల్లయ్య, వొద్దిరాల చంద్రయ్య, ఎలగుందుల బాలమల్లయ్య, అందె శివజ్యోతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




