అక్టోబర్ 7 కరీంనగర్ జిల్లా
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో 8 కోట్ల రూపాయలతో ఎకరన్నర స్థలంలో విశాలంగా నిర్మించిన అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ
అనాదిగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనక్కి నెట్టి వేయబడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. స్వయం పాలనలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
కరీంనగర్‌లో నిర్మించిన అంబేద్కర్ భవనం దళితులకు అండగా నిలువాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు. దళిత బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ది సాధ్యమని, మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. అన్ని వర్గాల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు చూపుతో గొప్ప రాజ్యంగాన్ని రచించారని, 75 సంవత్సరాలుగా ఆ రాజ్యాంగమే మార్గదర్శకంగా దేశంలో పాలన కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే స్వరాష్ట్రం సిద్ధించిందన్నారు.
