చేర్యాల ప్రాంత బందుకు సహకరించండి
ఆకునూర్ లో జేఏసీ సమావేశం
సిద్దిపేట జిల్లా ర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 11న జరిగే నాలుగు మండలాల బందును విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో జరిగిన జేఏసీ సమావేశానికి నియోజకవర్గ నాయకుడు అందె అశోక్, మండల కన్వీనర్ బొమ్మగోని అంజయ్య గౌడ్ మాట్లాడుతూ..
చరిత్ర వైభవం కలిగిన చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా నోటిఫికేషన్ వచ్చినా కూడా కళ్ళులేని కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 11న జరిగే బంధు ను విజయవంతం చేసి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జేఏసీ గ్రామ కన్వీనర్ వెలుగల రఘువీర్, ఎండి అజీముద్దీన్, ఉళ్ళెంగల రామ్ బ్రహ్మం,స్వర్గం శ్రీకాంత్, గోనెపల్లి రాజు, జంగిటి తోళ్ల ఆర్య, మాధ మల్లయ్య, సత్యం,వీరయ్య, దశరతం, కిష్టయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.
