చేర్యాల రెవెన్యూ డివిజన్ జి ఓ తో పల్లా రావాలి ,లేనిచో నీ ఓటమి తప్పదు…జాక్ చైర్మన్ చక్రదారి బైర వ బట్ల
అక్టోబర్ 9
సిద్దిపేట జిల్లా చేర్యాల గత ఏడు సంవత్సరాలు గా ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్న చేర్యాల డివిజన్ ఉద్యమం ఇక తారా స్థాయికి చేరుకుందని,2018 ఎన్నికల్లో, చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రామిస్ చేసి మాట తప్పిన అధికార పార్టీ నాయకుల ను ప్రజలు నమ్మరని చైర్మన్ చక్రదారి అన్నారు.. బి ఆర్ ఎస్ టిక్కెట్ తీసుకొని జనగామ కు అడుగు పెడుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ని అభిన్నందిస్తున్నానని,రెవెన్యూ డివిజన్ జీ ఓ తో చేర్యాలకు వస్తే, తాము స్వాగతిస్తానని,, లేనిచో ప్రజలు మీపై తిరగబడతారని జాక్ చైర్మన్ చక్రదారి పేర్కొన్నారు.
ముత్తిరెడ్డి చేసిన పా పాలు ఆయనతో పోవని ,చేర్యాల ప్రజలను పదే పదే మోసంచేసిన అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధుల ను ఎన్నికల్లో తిరగకుండా ప్రజలు అడ్డుకుంటారన్నారు..గత తొమ్మిదిన్నత సంవత్సరాల్లో జనగామ చేర్యాల ప్రాంతంలో ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని ,ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని జాక్ ఛైర్మన్ చక్రదారి ప్రశ్నించారు.. ప్రజలు అడగనిచోట,,ఉద్యమాలు లేని చోట రెవెన్యూ డివిజన్లు ప్రకటించిన ప్రభుత్వం చేర్యాల ప్రజల పై పూర్తిగా సవతి ప్రేమను చూపిందని,దాని మూల్యం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చెల్లించుకోవాలని చైర్మన్ అన్నారు.ముత్తిరెడ్డి పని అయి పోయింది.
నేను క్రొత్త అని చెపుతున్న పల్లను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని,,వారంలో డివిజన్ జీ ఓ, అలాగే బచ్చన్నపేట మార్కెట్ కమిటీ జీ ఓ లను తీసుక వచ్చి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ప్రాంతం పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జాక్ చైర్మన్ చక్రదారి డిమాండ్ చేశారు..ఏ డేళ్ళుగా ర్యాలీలు. రాస్తారోకోలు,,పాదయాత్రలు,,సైకిల్ యాత్రలు,చలో కలెక్టర్ కార్యాలయం,, గ్రామ గ్రామాల్లో కరపత్రాలను పంచటం,54 గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకోవటం,,అన్ని గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్ర లు,,చేర్యాల లో రిలే నిరదీక్షలు, కలెక్టర్,చీఫ్ సెక్రటరీ కి వినతి పత్రాలు,,కుల సంఘాల పోరాటాలు ఒక్కటి కాదు దాదాపు వందల కార్యక్రమాలు డివిజన్ కోసం చేసి చేర్యాల జాక్ ,,ఇక పల్లా కు వ్యతిరేకంగా గ్రామ గ్రామానికి జాక్ సభ్యులు గజ్జె కట్టి తిరుగుతామని జాక్ చైర్మన్ చక్రదారి హెచ్చ రించారు.
ముఖ్యమంత్రి తో మీకు ఉన్న సన్నిహిత సంబంధాలు ను ఉపయోగించి వాస్తవ పరిస్థితులను కేసీఆర్ కు వివర్ణించి డివిజన్,, జీ ఓ తెస్తేనే మీకు ఈ ప్రాంతంలో పుట్ట గతులు ఉంటాయని చైర్మన్ చక్రదారి అన్నారు..త్వరలో జాక్ తీసుకొనే మరో ప్రజా సంగ్రామం యాత్రకు ప్రజలు బీసీ ఎస్ సి, ఎస్ టీ, మైనారిటీ,, ప్రజా సంఘాలు, విద్యార్టీ సంఘాలు, వర్తక సంఘాలు, ఎమ్ ర్ పి ఏస్, మాల మహానాడు జాక్ సభ్యులు అందరూ సిద్ధంగా ఉండి, సహకరించాలని,జాక్ చైర్మన్ చక్రదారి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందెబీరన్న , జనగామ జిల్లా అధ్యక్షులు ఇషాక్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు,జాక్ కన్వెనర్ రామగాళ్ల నరేష్,ఒగ్గురాజు,లింగం,తదితరులు పాల్గొన్నారు.
