వర్గల్ మండల్ అక్టోబర్ 9:అక్రమ నిర్మాణం చేపడితే కఠిన చర్యలు.
తాహసిల్దార్ హరి కిరణ్ కుమార్ వర్గల్, విద్య సరస్వతి ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూములుల్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తున్నారని, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులతో కలసి తాసిల్దార్ హరికిరణ్ కుమార్ కు అక్రమ కట్టడాలు నిలిపివేయాలని వినతి పత్రం అందజేశారు.
దీనిపై స్పందించిన తాసిల్దార్ అక్రమ కట్టడాల నిర్మాణాలను పరిశీలించారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.