సిరిసిల్ల టౌన్ పోలీసులు సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాతంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసి 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ఒడిశా రష్ట్రానికి చెందిన ప్రశాంజిత్ రాయ్అ నే వ్యక్తి సోమవారం రోజున మధ్యాహ్నం 1 గంటల సమయంలో సిరిసిల్ల పాత బస్ స్టాప్ వద్ద ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని అనుమానాస్పదగా తిరుగుతూ పొలిసు వారిన ప్రయత్నించగా అతడిని పట్టుకొని తనిఖీ చేయగా అతని షోల్డర్ బ్యాగులో 4కిలోల గంజాయి ఉండగా అట్టి గంజాయి స్వాధీనం చేసుకొని అట్టి వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా గత కొద్దీ రోజులుగా ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్ కు వివిధ మార్గాల ద్వారా బస్సు లో తరలిస్తున్నాడాని తేలుపగ అట్టి వ్యక్తిని రిమాండుకు తరలించడం జరిగింది.
జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని,జిల్లా పరిధిలో తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడంతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు..




