ప్రాంతీయం

గరిమిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం

197 Views

అక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7

మంచిర్యాల లోని గరిమిళ్ల లయన్స్ క్లబ్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి, కరీంనగర్ వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం ను తేది 13.10.2023 శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచిర్యాలలోని రాంనగర్ లో గల నారాయణ హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లు గరిమిళ్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, జోన్ చైర్మన్ లయన్ సద్దనపు రాంచందర్,క్లబ్ డైరెక్టర్లు లయన్ గాజుల ముకేశ్ గౌడ్,లయన్ వంగల సంపత్ కుమార్,లయన్ శ్రీరామోజు రమేష్ బాబు తెలిపారు.

ఈ సందర్భముగా ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం నకు సంబందించిన కరపత్రములు విడుదల చేశారు.
కంటికి సమస్యలు ఉన్నవారు అంటే దృష్టి దోషాలు, మెల్లకన్ను ఉన్నవారిని గుర్తించి వెంటనే ఉచితంగా బస్సు సౌకర్యం తో రేకుర్తి ఆసుపత్రి కి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసిన వారిని మరల మంచిర్యాల కు తీసుకువస్తారు.

శిభిరానికి వచ్చేటపుడు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు వెంట తీసుకురాగలరని తెలిపారు.ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుచున్నాము.

ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ రాఘవేందర్ రావ్, కోశాధికారి లయన్ శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *