ముఖ్యమంత్రి అల్పాహార పథకం
అక్టోబర్ 9
పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి గ్రామ సర్పంచ్ భాస్కర్ తో కలిసి పర్యవేక్షించారు .
ఈ సందర్భంగా అల్పాహారంగా ఉప్మా మరియు టమాటో పచ్చడి లను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. డిఇఓ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాన్ని అమలు పరచని విధంగా కట్టుదిట్టంగా, ఆరోగ్యకరంగా, ప్రభుత్వ బడుల్లో చదివేది పేద విద్యార్థులే కాబట్టి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ అమలు చేస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులందరూ తమ జీవనోపాధి కోసం పొలం పనులకు వెళుతూ ఉంటారు, కాబట్టి విద్యార్థి యొక్క ఆకలిని గమనించి ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున మనందరం ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం ఉందని విద్యార్థులచే చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు, గ్రామ సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి పథకము రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అందుతుందని తద్వారా ప్రజలందరూ ఆర్థికంగా బలపడుతున్నారని అదేవిధంగా.
ఈ అల్పాహార పథకం కూడా మహిళలకు అంటే తల్లులకు పని భారాన్ని తగ్గించే విధంగా ఉందని ఉదయం అల్పాహారము మధ్యాహ్నము భోజనము విద్యార్థులకు అందుతున్నందున విద్యార్థులు కేవలం చదువు మీద దృష్టి పెట్టి మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.
ఈ సంవత్సరం 10వ తరగతి రాయబోయే విద్యార్థులను ఉద్దేశించి పది జీపీఏ సాధిస్తే నగదు పురస్కారాన్ని అందజేస్తానని తెలియజేశారు. హెచ్ఎంజి వెంకటేశం మాట్లాడుతూ అల్పాహార పథకాన్ని మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా వండిస్తున్నామని తెలిపారు.
ఆ తదుపరి ప్రార్థన అసెంబ్లీలో డీఈవో విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించి చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. గజ్వేల్ తాలూకా ఐసిడిఎస్ అధికారిని వెంకటరత్నం కూడా.
ఈ సందర్భంగా పాఠశాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు భూజాత , రమేష్ , వందన , పద్మా రెడ్డి నాగేశ్వరరావు. విద్యాధర్ రెడ్డి , శ్రీనివాసరావు రమణారావు , సంతోష రజిని , సిద్దయ్య , వెంకటేశ్వర్లు , భ్రమరాంబ పీఈటి రజనీ పాల్గొన్నారు. తర్వాత డిఈఓ శ్రీనివాసరెడ్డి ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి సార్ మర్కూకు కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం సర్పంచ్ భాస్కర్ తో కలిసి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
