Breaking News

రేపు జరగబోయే బందును విజయవంతం చేయండి – బీసీ జేఏసీ

38 Views

బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే వ్యతిరేకంగా రేపటి జరుగు బందును విజయవంతం చేయాలి
బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపు.

మంచిర్యాల జిల్లా.

ఈరోజు మంచిర్యాల జిల్లా ఎం కన్వెన్షన్ హాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు నరెడ్ల శ్రీనివాస్ వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు స్టేకు వ్యతిరేకంగా రేపు జరగబోవు రాష్ట్ర బందు లో మంచిర్యాల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వర్గాలు, రవాణా వ్యవస్థలు అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు , పెట్రోల్ బంకులు, బ్యాంకర్స్ , కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఈ బందులో పాల్గొని బీసీ ప్రజల ఆకాంక్షలను చాటాలని బీసీ జేఏసీ పిలుపునిస్తుంది.
70 సంవత్సరాల బిసి ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రం లో స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ కనిపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు స్టే విధించడం అంటే ఈ సమాజంలో ఉన్న మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగానే భావించడం జరుగుతుంది. ఈ వ్యవస్థలో అగ్రవర్ణాల పెత్తనం సమాజం మొత్తంగా ఆవరించి ఉన్నాది. న్యాయ వ్యవస్థ పైన కూడా వారి అగ్రకుల పెత్తనం కొనసాగుతుందని భావిస్తుంది. సమాజంలో మెజార్టీ ప్రజలైన బీసీలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే న్యాయం చేయాల్సిన కోర్టు కూడా మెజారిటీ ప్రజల పక్షాన ఉండకుండా వ్యవస్థలను ఆదిపత్య వర్గాలు తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం జరిగిందని , న్యాయ వ్యవస్థలు అంటే ప్రజలందరికీగౌరవం ఉంటుందని మెజార్టీ ప్రజల ఆకాంక్షలను కూడా గౌరవించాలని పేర్కొనడం జరిగింది. రేపు జరగబోయే బందుకు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీలు, సిపిఐ పార్టీ లు, అన్ని వామపక్ష పార్టీలు, మరియు అసంఘటిత కార్మిక సంఘాలు తమ సంపూర్ణ మద్దతు తెలిపినందుకు బీసీ జేఏసీ పక్షాన బీసీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, రేపటిబందు విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది బందులో కూడా ప్రత్యక్షంగా పాల్గొని బందు విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.

ఈ విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు కొండయ్య, కొండిల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదే సత్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు అమెరి శెట్టి రాజు అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్, పల్లె భూమేష్, బీసీ నాయకులు నీలి శ్రీనివాస్, డాక్టర్ రాజు కిరణ్, ఊదారి చంద్రమోహన్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు రాజేశం గౌడ్, స్వర్ణకార సంఘం పట్టణ అధ్యక్షుడు ముత్తోజు రమేష్ కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, బి ఆర్ ఎస్ నాయకులు అంకం నరేష్,బేరా సత్యనారాయణ, బిఆర్ఎస్ బీసీ సీనియర్ నాయకులు బిజెపి నాయకులు గుడారపు కృష్ణమూర్తి, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎదునూరి రమేష్, ఎం బి సి నాయకులు వైద్య భాస్కర్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు విక్రమ్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు పోట్ట మధుకర్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఒడ్డె రాజమౌళి, వివిధ బీసీ సంఘాల జిల్లానాయకులు కర్ణకంటి రవీందర్ కిరణ్, వేముల అశోక్, రాయబారపు కిరణ్, విద్యార్థి సంఘ నాయకులు తోట రాజేష్ చేరాల వంశీ, ఎండి సల్మాన్, పురెళ్ల నితీష్,ఇంతల్ రాథోడ్, జుమ్మిడి గోపాల్, జాగిరి రాజేష్,బచ్చలి ప్రవీణ్, నామిని రాజేష్,హరీష్ గౌడ్, ,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *