పడ్డాయి నా పచ్చని తెలంగాణ మీద రాబందుల కళ్ళు పడ్డాయి
70 ఏళ్ల పాటు నా తెలంగాణను దోచుకున్న అవే కళ్ళు మళ్ళీ నా తెలంగాణ మీద పడ్డాయి
అన్ని రంగాలలో నిండు కుండను తలపిస్తున్న నా తెలంగాణను దోచుకోవాలని ఆ రాబందులు చూస్తున్నాయి
బెల్లం చుట్టూ ఈగల్లా ఒకేసారి వాలుతున్నయి
నాడు తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చి నేడు తనను తెలంగాణ కోడలిగా గుర్తించాలని మొసలి కన్నీరు కార్చుతుంది తదుపరి కాబోయే ముఖ్యమంత్రి తానేనని డాంబికాలు పలుకుతుంది రాజన్న బిడ్డ షర్మిల
నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించిన రాజన్న ఆత్మబంధువుగా చెప్పుకునే కేవిపి … నేడు తనను తెలంగాణ ఆత్మగా గుర్తించాలని అంటున్నాడు
తెలంగాణ మీద ఒంటి నిండా విషం నింపుకున్న చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో ఎలాగైనా అధికారలోకి ఒచ్చి నవ తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం చెలాయించాలని పట్టుదలతో ఉన్నాడు
ఇక అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి కనుసనుల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పని చేస్తున్నాడు
ఈ దొంగలకు తెలంగాణ మీద కాదు పచ్చని తెలంగాణ #సంపద మీద ప్రేమ… తెలంగాణ ప్రజలారా





