రాజకీయం

ఇటిక్యాలలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

88 Views

జగదేవ్పూర్ మండలం:అక్టోబర్ 6
24/7 తెలుగు న్యూస్ సిద్దిపెట్

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ నాయకులు ఇటిక్యాల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ , గ్రామపంచాయతీ పాలకవర్గం, ఆధ్వర్యంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన తర్వాత మిఠాయిలు పంచుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని వర్ణాల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతుంది అని ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా నిరుపేదలకు చేయూతను అందించడం సీఎం కేసీఆర్ దాతృత్వానికి నిదర్శమని, సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి లక్ష ఓట్లకు పైగా మెజార్టీ రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వాజిదా బేగం అయూబ్, గ్రామ ఉప సర్పంచ్ చిగురుపల్లి రమేష్ ,గ్రామపంచాయితీ పాలక వర్గం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సోల స్వామి ,గ్రామ రైతు బందు సమితి అధ్యక్షుడు ఆడెపు బిక్షపతి, కొండపోచమ్మ డైరెక్టర్ మల్లం జానకి రాములు పిఎసిఎస డైరెక్టర్ ఎడపల్లి వెంకటయ్య యువకులు, గ్రామ మహిళలు ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *