తరలివచ్చిన గ్రామ ప్రజలు
(తిమ్మాపూర్ అక్టోబర్ 06)
తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులను సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావుతో కలిసి ప్రారంభించిన ఎమ్మేల్యే రసమయి బాలకిషన్…
అనంతరం సర్పంచ్ మాదాడి భారతి అధ్యక్షతన గ్రామంలో ఏర్పాటు చేసిన పర్లపల్లి ప్రగతి నివేదన సభలో ఎమ్మేల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..
పర్లపల్లి గ్రామాన్ని చూస్తుంటే పట్టణంలో పర్యటిస్తున్నట్టు అనిపిస్తున్నదన్నారు. రూ. కోట్ల నిధులతో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. తెలంగాణ పల్లెలు పర్లపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి ని అభినందించారు.
తెలంగాణ రాకముందు పల్లెల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎంతలా అభివృద్ధి జరిగాయో ప్రజలు చూడాలన్నారు. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎంతలా కృషి చేస్తున్నారో వివరించారు. ప్రజలు మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టి మండల అ ద్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు ఇనుకొండ జితేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, స్థానిక ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి , ఉప సర్పంచ్ రాజేష్, తహసిల్దార్ కనకయ్య, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.